- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
INC: మీ పార్టీ ఆఫీసుల్లోకి వచ్చి కొడతాం జాగ్రత్త..! కాంగ్రెస్ ఎమ్మెల్యే స్ట్రాంగ్ వార్నింగ్

దిశ, వెబ్ డెస్క్: మీ పార్టీ ఆఫీసుల్లోకి వచ్చి కొడతాం జాగ్రత్త! అని బీఆర్ఎస్ నేతలకు చొప్పదండి(Choppadhandi) కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం(MLA Mediaplly Sathyam) వార్నింగ్ ఇచ్చారు. సోమవారం ఆయన కరీంనగర్(Karimnagar) లో మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ(RS Party) ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(MLA Padi Kowshik Reddy) ప్రవర్తన పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అలాగే ప్రభుత్వ కార్యక్రమంలో మంత్రుల ముందు కౌశిక్ రెడ్డిపై అలా ప్రవర్తించడం సరికాదని అన్నారు. నిన్న కౌశిక్ రెడ్డి ఓ సైకోలాగా ప్రవర్తించారని, కౌశిక్ రెడ్డిని అడ్డుపెట్టుకుని కేసీఆర్, కేటీఆర్ శిఖండి రాజకీయాలు చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కౌశిక్ రెడ్డిని గెలిపించినందుకు హుజురాబాద్ ప్రజలు బాధపడుతున్నారని వ్యాఖ్యానించారు.
ఎమ్మెల్యే సంజయ్ పై దాడి చేసిన కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఇక కౌశిక్ రెడ్డి నీకు దమ్ము, ధైర్యం ఉంటే కరీంనగర్ తెలంగాణ చౌరాస్తాకు రా.. నువ్వో నేనో తేల్చుకుందాం అని ఎమ్మెల్యే సవాల్ విసిరారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ నేతలైన కేసీఆర్(KCR), కేటీఆర్(KTR), హరీష్ రావు(Harisha rao)లను కరీంనగర్ వేదిక నుంచి హెచ్చరిస్తున్నానని, మీ పార్టీ నాయకులను కంట్రోల లో పెట్టుకోకపోతే ఎవ్వరిని రోడ్ల పై తిరగనీయ్యం అని, అవసరం అయితే మీ పార్టీ ఆఫీసుల్లోకి వచ్చి కొట్టాల్సిన పరిస్థితి వస్తుంది తస్మాత్ జాగ్రత్త అని కాంగ్రెస్ ఎమ్మెల్యే మాస్ వార్నింగ్ ఇచ్చారు. కాగా ఆదివారం కరీంనగర్ కలెక్టర్ కార్యాలయంలో కరీంనగర్ జిల్లా అభివృద్దిపై జరుగుతున్న సమీక్షా సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతుండగా.. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అడ్డుకొని, కార్యక్రమంలో రసభాస సృష్టించారు.