- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు కుచ్చుటోపీ.. గాంధీభవన్‌లో ప్రధాని దిష్టిబొమ్మ దహనం

దిశ, తెలంగాణ బ్యూరో: ఉద్యోగాల పేరుతో.. నిరుద్యోలకు కేంద్ర ప్రభుత్వం టోపీ పెట్టిందని, ఏటా రెండ్లు కోట్ల భర్తీ చేస్తామని మోసగించిందని తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు జక్కిడి శివచరణ్ రెడ్డి ఆరోపించారు. ఎన్నికల వేళ హామీలిచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరించి, తెలంగాణపై వివక్ష చూపుతోందని విమర్శించారు. మోదీ సర్కారుకు వ్యతిరేకంగా యువజన కాంగ్రెస్ గురువారం ఆందోళన కార్యక్రమం చేపట్టింది. ఈమేరకు గాంధీ భవన్లో యువజన కాంగ్రెస్ నేతలు, నాయకులు ప్రధాని దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈసందర్భంగా జక్కిడి శివచరణ్ రెడ్డి మాట్లాడుతూ.. నిరుద్యోగులకు మోసగించిన మోదీ సర్కార్ బడ్జెట్లో పక్క రాష్ట్రాలకు నిధులు ఇచ్చి తెలంగాణపై వివక్ష చూపడం బాధాకరమన్నారు.
తెలంగాణ రాష్ట్రం నుంచి బీజేపీ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులుగా ఉన్నా.. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం చిల్లి గవ్వ కూడా విడుదల చేయకపోవడం సిగ్గుచేటు అని అన్నారు. రాష్ట్రానికి నిధులు తీసుకురాలేని కేంద్ర మంత్రులు పదవిలో ఉండి కూడా దండగే అన్నారు. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రంపై చూపిన వివక్షకు కేంద్ర మంత్రులు స్పందించకపోతే హైదరాబాద్ రోడ్లపై తిరగనీయకుండా ఎక్కడికక్కడ యువజన కాంగ్రెస్ నాయకులు అడ్డుకుంటారని హెచ్చరించారు. కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర కార్యదర్శులు, హైదరాబాద్, ఖైరతాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల అధ్యక్షులు, నియోజకవర్గ మండల అధ్యక్షులు, కమిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.