- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
తెలంగాణలో మళ్లీ తెరపైకి టీచర్ దంపతుల బదిలీల అంశం
by GSrikanth |

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో మళ్లీ టీచర్ దంపతుల బదిలీల అంశం తెరపైకి వచ్చింది. మంగళవారం హైదరాబాద్‌లోని మహాత్మ జ్యోతిబా ఫూలే భవన్‌లో నిర్వహిస్తోన్న ప్రజావాణికి స్పౌజ్ ఫోరం ప్రతినిధులు భారీగా వచ్చారు. రాష్ట్రంలో వెంటనే బదిలీలు చేపట్టాలని ప్రజావాణిలో వినతిపత్రాలు సమర్పించారు. మొత్తం 1500 మంది ఉపాధ్యాయులు బదిలీలు కోరుతున్నట్లు తెలుస్తోంది. భర్త ఒకచోట, భార్య మరోచోట ఉండటం వల్ల కుటుంబానికి దూరమవుతున్నామని, పిల్లల భవిష్యత్ కూడా ప్రశ్నార్థకంగా మారుతోందని ఆవేదన చెందుతున్నారు. కుటుంబంతో గడపలేకపోయే పరిస్థితి నెలకొందని వినతుల్లో పేర్కొన్నారు.
Next Story