ఇలాగే మాట్లాడితే తరిమికొట్టే పరిస్థితి వస్తుంది.. కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఫైర్

by Ramesh Goud |
ఇలాగే మాట్లాడితే తరిమికొట్టే పరిస్థితి వస్తుంది.. కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ నేతలు అధికారం పోయిందనే అక్కసుతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని, ఇలాగే ప్రజలు తెలంగాణ నుంచే తరిమి కొట్టే పరిస్థితి వస్తుందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ (Congress MLC Balmoor Venkat) ఫైర్ అయ్యారు. తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు (Telangana Assembly Sessions) కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఇవాళ గవర్నర్ ప్రసంగానికి (Governor Speach) ధన్యవాద తీర్మాణం ఏర్పాటు చేశారు. సమావేశాల అనంతరం శాసన మండలి మీడియా పాయింట్ (Council Media Point) వద్ద మాట్లాడిన బల్మూర్ వెంకట్.. అసెంబ్లీలో బీఆర్ఎస్ నాయకుల (BRS Leaders) తీరుపై మండిపడ్డారు.

ఆయన మాట్లాడుతూ.. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం (BRS Government) ఉన్నప్పుడు అసెంబ్లీలో మాట్లాడేందుకు కాంగ్రెస్ నేతలకు (Congress Leaders) అవకాశం ఇవ్వలేదని, ఇప్పుడు తాము అవకాశం ఇస్తుంటే ప్రజా సమస్యలపై చర్చించకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. అలాగే అధికారం పోయిందని బీఆర్ఎస్ నేతలు పిచ్చి కుక్కల లెక్క మాట్లాడుతున్నారని, బీఆర్ఎస్ నేతల పిచ్చిని ప్రజలు గుర్తించే పక్కన పెట్టారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇలాగే మాట్లాడితే పిచ్చి కుక్కలకు పట్టిన గతే బీఆర్ఎస్ నేతలకు పడుతుందని, బీఆర్ఎస్ ను తెలంగాణ ప్రజలు తిరస్కరించినా.. అహంకారం తగ్గడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

గవర్నర్ ప్రసంగాన్ని కేటీఆర్ (KTR) అవమానించారని, బీఆర్ఎస్ నేతలు ముఖ్యమంత్రి చైర్ (Chief Minister Chair) ను అవమానిస్తున్నారని అన్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని లెక్క చేయడం లేదని, శాసనసభా విధానాలను తుంగలో తొక్కుతున్నారని తెలిపారు. పాత రోజుల్లో దొరలు ప్రదర్శించినట్టు అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారని, అధికారం పోయిందనే అక్కసుతో.. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఎవరూ ఊరుకోరని స్పష్టం చేశారు. ఇప్పటికే అధికారం నుంచి తరిమికొట్టిన ప్రజలు.. ఇలాగే ప్రవర్తిస్తే తెలంగాణ నుంచి కూడా తరిమికొట్టే పరిస్థితి వస్తుందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఘాటు వ్యాఖ్యలు చేశారు.



Next Story