కాంగ్రెస్ వస్తే మళ్లీ ఆ రాజ్యమే.. బోధన్‌ సభలో CM KCR

by Sathputhe Rajesh |   ( Updated:2023-11-15 08:56:51.0  )
కాంగ్రెస్ వస్తే మళ్లీ ఆ రాజ్యమే.. బోధన్‌ సభలో CM KCR
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ పార్టీపై సీఎం కేసీఆర్ ఫైర్ అయ్యారు. సీఎం కేసీఆర్ బుధవారం బోధన్ ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడారు. కాంగ్రెస్ వస్తే మళ్లీ బ్రోకర్ల రాజ్యం వస్తుందన్నారు. 24 గంటల కరెంట్ ఉండటం తప్పా అన్నారు. రైతుబంధు దుబారా అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారని.. ధరణి తీసేస్తామని, కరెంట్ 3 గంటలే ఇస్తామని కాంగ్రెస్ నాయకులు బహిరంగంగానే చెప్తున్నారన్నారు. నిజాంసాగర్ ను ముంచింది కాంగ్రెస్సే అన్నారు. ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్ లోనూ 24 గంటల కరెంట్ లేదన్నారు. కేసీఆర్ బ్రతికున్నంత కాలం తెలంగాణ సెక్యులర్ రాష్ట్రంగానే ఉంటుందన్నారు. కాంగ్రెస్‌కు ఓటు వేసి ప్రమాదాన్ని కొని తెచ్చుకోవద్దన్నారు. బోధన్ లో సుదర్శన్ రెడ్డి గెలిస్తే 3 గంటలే కరెంట్ వస్తుందన్నారు. బీడీ కార్మికుల పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ అన్నారు. ఇక్కడ అభివృద్ధి, సంక్షేమ పథకాలు చూసి మహారాష్ట్ర వాళ్లు వచ్చి అక్కడ బీఆర్ఎస్ పార్టీ పెట్టమని అడుగుతున్నారన్నారు.

Advertisement

Next Story