- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
MLC Kodandaram: నాకు సెక్యూరిటీ వద్దు.. వ్యక్తిగత భద్రత సిబ్బందిని నిరాకరించిన ఎమ్మెల్సీ కోదండరామ్
by Prasad Jukanti |

X
దిశ, డైనమిక్ బ్యూరో: ఎమ్మెల్సీ కోదండరామ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్సీ హోదాలో తన వ్యక్తిగత భద్రతగా ఇచ్చే సెక్యూరిటీని ఆయన నిరాకరించారు. తనకు వ్యక్తిగత భద్రత సిబ్బంది అవసరం లేదని తాను ప్రజల మనిషిని అని అందువల్ల భద్రత సిబ్బంది అవసరం లేదన్నారు. సెక్యూరిటీ వల్ల ప్రజలతో సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉందని అందువల్ల తనకు ఇచ్చే సెక్యూరిటీని నిరాకరించినట్లు ఆయన తెలిపారు. కాగా గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా కోదండరామ్ ఇటీవలే మరో ఎమ్మెల్సీ అమీర్ అలీఖాన్ తో కలిసి ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్సీ పదవి తనకు అదనపు బాధ్యతగా మాత్రమే భావిస్తున్నానని, ఉద్యమకారులు ఆశయాల కోసం పని చేస్తానని కోదండరామ్ ఆ సందర్భంలో పేర్కొన్నారు.
Next Story