- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కోహెడలో హైడ్రా పంజా.. భారీ బందోబస్తు నడుమ ఫామ్ హౌజ్ కూల్చివేత

దిశ, వెబ్ డెస్క్: హయత్ నగర్ (Hayath Nagar) కోహెడ (Koheda)లో హైడ్రా (Hydra) పంజా విసురుతోంది. ప్లాట్లు (Plots) కబ్జా చేసి ఓ రియల్టర్ (Realter) కట్టుకున్న ఫామ్‌హౌజ్ (FormHouse) లో కూల్చివేతలు (Demolished) చేపట్టింది. హైడ్రా హైదరాబాద్ (Hyderabad)లోని ఆక్రమణదారుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. సామాన్యులను భయభ్రాంతులకు గురి చేసి కబ్జా చేసిన స్థలాల్లో కూల్చివేతలు చేపట్టి, ప్రజలకు న్యాయం చేస్తోంది. హైడ్రా కార్యాలయం (Hydra Office)లో చేపట్టిన ప్రజా వాణి కార్యక్రమం (Praja Vani Programme) ద్వారా వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి, వాటికి పరిష్కారం చూపిస్తోంది. ఈ క్రమంలోనే కొందరు ప్లాట్ ఓనర్స్ (Plot Owners) ఇచ్చిన ఫిర్యాదు (Complaint) స్పందించింది.
కోహెడ ప్రాంతంలో ఓ రియల్టర్ కొందరు వ్యక్తులకు చెందిన ప్లాట్లను కబ్జా చేసి, దర్జాగా ఫామ్ హౌజ్ నిర్మించుకున్నాడు. దీనిపై ప్లాట్ ఓనర్స్ ఎన్ని ఆఫీసుల చుట్టూ తిరిగిన ప్రయోజనం లేకపోయింది. దీంతో 170 మంది ప్లాట్ ఓనర్స్ హైడ్రాను సంప్రదించారు. ప్రతీ సోమవారం హైడ్రా కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి వెళ్లి, హైడ్రా కమిషనర్ రంగనాథ్ (Hydra Commissioner Ranganath)కి ఫిర్యాదు చేశారు. కోహెడ గ్రామంలో సర్వే నెంబర్ 951, 952 లోని 7.258 గుంటల భూమిని ఓ రియల్టర్ కబ్జా చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు.. కోహెడ ప్లాట్ ఓనర్స్ ఫిర్యాదు పై విచారణ చేపట్టారు. ఆదివారం భారీ బందోబస్తు (heavy security) నడుమ కూల్చివేతలు చేపట్టారు. దీంతో తమకు న్యాయం జరిగిందని ప్లాట్ ఓనర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ ఫిర్యాదుపై స్పందించి న్యాయం చేసిన హైడ్రాకు కృతజ్ఞతలు చెబుతున్నారు.