పొలం కల్లాల్లోకి కాంగ్రెస్​...!

by srinivas |
పొలం కల్లాల్లోకి కాంగ్రెస్​...!
X
  • పంట నష్టంపై వివరాల సేకరణ
  • అన్ని జిల్లాల్లోని రైతులకు పరామర్శ
  • కలెక్టర్లకు వినతి పత్రాలు అందజేత

దిశ, తెలంగాణ బ్యూరో: అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలపై కాంగ్రెస్ పార్టీ ఆరా తీస్తున్నది. టీపీసీసీ, కిసాన్​కాంగ్రెస్ కమిటీల ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో పంట నష్టంపై వివరాలు సేకరిస్తున్నారు. నేరుగా పొలం కల్లాల్లోకి వెళ్లి ధాన్యం, ఇతర పంటల నష్టంపై అంచనాలు తీసుకుంటున్నారు. రైతులకు మనోదైర్యం కల్పిస్తూ పరామర్శిస్తున్నారు. ప్రభుత్వం నుంచి సాయం అందేలా కాంగ్రెస్​పార్టీ పోరాడుతుందని భరోసా ఇస్తున్నారు. ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం, తడిచిన ధాన్యాన్ని పట్టించుకోకపోవడం, తరుగు పేర దోపిడీ, మొక్కజొన్న పంట కొనుగోలు ప్రారంభించకపోవడం వడగండ్ల తో నష్టపోయిన పంటలకు నష్ట పరిహారం ఇవ్వకపోవడం వంటి వాటిని అన్ని జిల్లాల కలెక్టర్లకు వినతి పత్రాలు అందజేశారు. కొన్ని జిల్లాల్లో కలెక్టరేట్ల ముందు కిసాన్​కాంగ్రెస్, రైతులు సమన్వయంతో నిరసనలు నిర్వహించారు. అదే విధంగా పూర్తి స్థాయిలో పంట నష్టం అంచనా తర్వాత, రైతులను ఆదుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కాంగ్రెస్​పార్టీ అధికారికంగా లేఖ రాయనున్నది.

Advertisement

Next Story