ముషీరాబాద్​‌లో ప్రధాని మోదీ రోడ్ షో

by Naresh |   ( Updated:2023-11-27 15:26:36.0  )
ముషీరాబాద్​‌లో ప్రధాని మోదీ రోడ్ షో
X

దిశ, ముషీరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా హైదరాబాద్‌లో ప్రధాని మోదీ రోడ్ ​షో నిర్వహించారు. సోమవారం సాయంత్రం ఐదున్నర గంటలకు ఆర్టీసీ క్రాస్ ​రోడ్స్ నుంచి ప్రారంభమైన రోడ్ ​షో చిక్కడపల్లి, నారాయణగూడ, వైఎంసీఏ కాచిగూడ మీదుగా సాగింది. ముందుగా ఆర్టీసీ క్రాస్​ రోడ్స్ కు వచ్చిన మోదీ అక్కడ ప్రజలకు అభివాదం చేస్తూ అందరినీ ఉత్సాహపరిచారు. ముషీరాబాద్​ నియోజకవర్గం నాయకులను కలసిన అనంతరం ఓపెన్​ ప్​కారుపై నిలబడి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. మోదీతో పాటు రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు డా. లక్ష్మణ​లు ర్యాలీలో పాల్గొన్నారు. ముషీరాబాద్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి పూస రాజు ఆధ్వర్యంలో ఆర్టీసీ క్రాస్ ​రోడ్స్‌లో వేదికను ఏర్పాటు చేసి మోదీకి మంగళవాయిద్యాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన లంబాడీ నృత్యాలు ఆకట్టుకున్నాయి. దారిపొడవునా బీజేపీ నాయకులు, కార్యకర్తలు పూల వర్షం కురిపిస్తూ మోదీకి ఘన స్వాగతం పలికారు. చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ మోదీని చూసేందుకు ఉత్సాహంగా తరలివచ్చారు. ప్రధాని మోదీ రోడ్ ​షో నేపథ్యంలో పోలీసులు పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు.

Advertisement

Next Story