- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
తాగునీరు వృథా.. వ్యక్తికి ఫైన్.. వారం వ్యవధిలో రెండో ఘటన

దిశ, ఖైరతాబాద్ : జలమండలి సరఫరా చేసే తాగునీటిని ఇతర అవసరాలకు ఉపయోగిస్తున్న వారిపై అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ నెల 5వ తేదీన జూబ్లీహిల్స్ తో తన ఇంటి ముందు తాగునీటితో బైక్ వాష్ చేసిన వ్యక్తికి ఫైన్ వేయగా.. తాజాగా ఇలాంటి పనే చేసిన వ్యక్తికి జరిమానా విధించారు. జూబ్లీహిల్స్ లో తాగునీటితో బైక్ వాష్ చేసిన ఘటన తర్వాత.. జలమండలికి తాగునీటి వృథాపై ఫిర్యాదులు అందుతున్నాయి. కస్టమర్ కేర్ కు ఫోన్ చేయడంతో పాటు ఆయా ప్రాంతాల్లో నేరుగా అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. దీంతో జీఎంలు తమ పరిధిలో.. తాగునీరు సరఫరా చేసే సమయంలో తమ సిబ్బందితో ఆయా ప్రాంతాల్లో తనిఖీలు చేయిస్తున్నారు. ఎవరైనా తాగునీరు వృథా చేసినట్లు గమనిస్తే.. వెంటనే నోటీసులు జారీ చేసి జరిమానా విధిస్తున్నారు. అందులో భాగంగానే.. ఓ అండ్ ఎం డివిజన్-6 జీఎం హరిశంకర్.. తమ మేనేజర్ తో కలిసి తనిఖీలు చేస్తుండగా.. జర్నలిస్ట్ కాలనీలో ఇంటి నెంబర్. 8-2-293/82/J/A/20 గల యరత శోభ అనే వినియోగదారులు తాగునీటితో వాహనం శుభ్రం చేయడం గుర్తించారు. దీంతో జలమండలి నిబంధనలను ఉల్లంఘించినందుకు వారికి రూ.1000 ఫైన్ వేశారు. ఎవరైనా ఇలాంటి పనులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.