- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Hyderabad : గంజాయి డాన్ పై పీడీ యాక్ట్

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్(Hyderabad) పాతబస్తీకి చెందిన ఓ గంజాయి స్మగ్లర్(Ganja Smuggler) పై పీడీ యాక్ట్ నమోదు చేశారు పోలీసులు. దూల్ పేటకు చెందిన గంజాయి స్మగ్లర్ అంగూరు బాయిపై మంగళవారం హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశాలతో పీడీ యాక్ట్ నమోదయ్యింది. గంజాయి అక్రమ అమ్మకాల కేసులో చంచల్ గూడ జైల్లో ఉన్న ఆమెకు పీడీ జీవోను దూల్పేట్ సీఐ మధుబాబు అందించారు. పలుమార్లు అరెస్టు చేసిన బెయిల్ పై వచ్చి మళ్ళీ గంజాయి వ్యాపారం కొనసాగిస్తున్నట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. అంగూరు బాయిపై ఇప్పటికే 30కి పైగా గంజాయి కేసులు.. 20 ఎక్సైజ్ పీఎస్ లో, మరో 10 సివిల్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయని పోలీసులు పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక డ్రగ్స్, గంజాయి వంటి మాదకద్రవ్యాల ముఠాలపై ఉక్కుపాదం మోపుతోంది. డ్రగ్స్ అమ్ముతున్న వారు, డ్రగ్స్ వినియోగిస్తున్న వారు ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదని, జైలుకు పంపిస్తామని సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గంజాయి స్మగ్లర్స్ పై కఠిన చర్యలు తీసుకుంటున్నారు ఉన్నతాధికారులు.