- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సికింద్రాబాద్ లో పద్మారావు గెలుపు ఖాయం
దిశ, సికింద్రాబాద్ : ప్రజల ఆశీర్వాదం పద్మారావుకు ఉందని, రానున్న పార్లమెంటు ఎన్నికల్లో భారీ విజయం సాధిస్తారని సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ధీమా వ్యక్తం చేశారు. పద్మారావు కు టికెట్ కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఆదివారం పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు , కార్పొరేటర్ లు ఆయన నివాసంలో సమావేశమయ్యారు. పెద్ద ఎత్తున చేరుకున్న పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పద్మారావు గౌడ్ తో పాటు పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, మాగంటి గోపీనాథ్, కాలేరు వెంకటేష్, మాజీ మంత్రి మహమ్మూద్ అలీ హాజరయ్యారు. ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ మాట్లాడుతూ తన మీద ఎంతో నమ్మకంతో టికెట్ కేటాయించిన
పార్టీ అధ్యక్షులు కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. పార్లమెంట్ పరిధిలోని తమ ఎమ్మెల్యేలు నిరంతరం ప్రజల మధ్యన ఉంటూ ప్రజాబలం కలిగిన వారన్నారు. పార్లమెంట్ ప్రజల ఆశీర్వాదం తమకు ఉందని చెప్పారు. బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ చాలా అభివృద్ధి చెందిందన్నారు. గ్రేటర్ ప్రజలు తమను గుర్తుపట్టని వారు లేరని, తమ స్వయంకృషితో రాజకీయాల్లోకి రావడం వల్లే ఈ పేరు వచ్చిందన్నారు. నియోజకవర్గ ప్రజలే తమ కుటుంబ సభ్యులుగా నమ్ముకుని పనిచేస్తున్నామని, వారి ఆశీర్వాదంతో భారీ మెజారిటీతో గెలుస్తానని చెప్పారు. ఐదేళ్లు ఎంపీగా ఉన్న కిషన్ రెడ్డి సికింద్రాబాద్ పార్లమెంటుకు చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు.
కేంద్ర మంత్రిగా ఉండి కూడా నగర అభివృద్ధికి ప్రత్యేక నిధులు తీసుకు రాలేదని అన్నారు. అనంతరం పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలు మాట్లాడుతూ హైదరాబాదులో పద్మారావును గుర్తుపట్టని వారు లేరన్నారు. పద్మారావు గౌడ్ ను భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని అన్నారు. పద్మారావు గౌడ్ పేరు ప్రకటించగానే ప్రజల్లో అపూర్వ స్పందన లభించింది అన్నారు. కాంగ్రెస్ ,బీజేపీలు రాష్ట్రానికి చేసింది ఏమీ లేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఇంతవరకు అమలు చేయడం
లేదని, ప్రజలు దీనిని గుర్తించాలన్నారు. రాష్ట్ర ఎన్నికలు ఒకవైపు ఉంటే, సికింద్రాబాద్ ఎన్నికలు ఒకవైపు ఉంటాయని పేర్కొన్నారు. భారీ మెజారిటీతో పద్మారావు గెలుపు ఖాయమని తెలిపారు. రెండు రోజుల్లో పూర్తిస్థాయి సమావేశం నిర్వహించి ఎన్నికల ప్రచార కార్యక్రమాలు ప్రకటిస్తామని తెలిపారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు ముటా జయసింహ, మన్నే గోవర్ధన్, రామేశ్వర్ గౌడ్, కార్పొరేటర్లు సామల హేమ రాసూరి సునీత రమేష్, కంది శైలజ తదితరులు పాల్గొన్నారు.