అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రం సుఖసంతోషాలతో ఉండాలి: ఎమ్మెల్సీ కవిత

by S Gopi |   ( Updated:2023-02-17 11:43:12.0  )
అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రం సుఖసంతోషాలతో ఉండాలి: ఎమ్మెల్సీ కవిత
X

దిశ, ఖైరతాబాద్: రేణుక ఎల్లమ్మ వారి ఆశీస్సులతో రాష్ట్రం సుఖ సంతోషాలతో ఉండాలని ఎమ్మెల్సీ కవిత కోరుకున్నారు. శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు 69వ జన్మదిన పురస్కరించుకుని బల్కంపేటలోని ఎల్లమ్మ పోచమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. దేవస్థానం వారు నిర్వహించిన ప్రత్యేక పూజలు అమ్మవారికి పంచామృత అభిషేకము, బంగారు చీరతో అలంకారం, వేదపండితులచే శ్రీ రాజశ్యామల యాగం, మృత్యుంజయ హోమంలో పాల్గొన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు.


ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని అన్నారు. బల్కంపేట ఆలయం దినదినాభివృద్ధి చెందుతుందని అన్నారు. బల్కంపేట ఆలయ అభివృద్ధికి స్థానిక మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, అధికారులు అశేషమైన కృషి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన కార్యనిర్వహణాధికారిణి ఎస్. అన్నపూర్ణ, దేవస్థాన ఫౌండర్ చైర్మన్ కె. సాయిబాబా, బీఆర్ఎస్ అమీర్ పేట డివిజన్ అధ్యక్షులు హనుమంతరావు, నాయకులు నామన సంతోష్ కుమార్, కరుణాకర్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, అశోక్ యాదవ్, గులాబ్ సింగ్, కూతురు నార్సిమ్మ, కట్టా బలరాం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed