- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
క్యాన్సర్ పై అవగాహన ర్యాలీ.. జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే గాంధీ
దిశ, మియాపూర్: ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా హఫీజ్ పేట్ డివిజన్ పరిధి మదీనగూడ రామకృష్ణ నగర్ కాలనీలో కిమ్స్ ఆసుపత్రి వారి సౌజన్యంతో నిర్వహించిన క్యాన్సర్ పై అవగహన సైకిల్ ర్యాలీని కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ తో కలిసి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ప్రారంభించారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ.. ప్రజలకు క్యాన్సర్ గురించి అవగాహన పెంపొందించడానికి, దాని నివారణ, గుర్తింపును, చికిత్సను ప్రోత్సహించేందుకు ప్రతీయేట ఫిబ్రవరి 4న ప్రపంచ క్యాన్సర్ దినోత్సవంగా గుర్తిస్తారని పేర్కొన్నారు. ప్రజలకు క్యాన్సర్ వ్యాధిపై అవగాహన పెంచుకుందాం క్యాన్సర్ రహిత సమాజాన్ని నిర్మించుకుందామన్నారు.
క్యాన్సర్ ను తొలిదశలోనే గుర్తించి చికిత్స అందిస్తే నియంత్రణ సాధ్యమేనని ధూమపానం, పొగాకు ఉత్పత్తుల వాడకం, మద్యం సేవించడం వంటి దుర అలవాట్లకు దూరంగా ఉండి మిమ్మల్ని మీ కుటుంబాన్ని క్యాన్సర్ నుంచి కాపాడుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హఫీజ్ పేట్ డివిజన్ బీఆర్ఎస్ గౌరవ అధ్యక్షుడు వాలా హరీష్ రావు, బీఆర్ఎస్ నాయకులు బాబు మోహన్ మల్లేష్, విష్ణు వర్ధన్ రెడ్డి, రసూల్, కృష్ణ రావు, ఉమ మహేశ్వర రావు, నాగేశ్వరరావు, రాము, రవి చందు, ప్రవీణ్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.