Hyd: వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా గెలవబోతున్నా: Putta Madhu

by srinivas |   ( Updated:2023-08-27 13:34:02.0  )
Hyd: వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా గెలవబోతున్నా: Putta Madhu
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ నెక్లెస్ రోడ్ జలవిహార్‌లో మన్నూరు కాపు ప్లీనరీ సన్నాహక సభ జరిగింది. ఈ సభలో మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌తో పాటు మంథని జెడ్పీ చైర్మన్ పుట్ట మధు, మున్నూరు కాపు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. తనపై వచ్చిన ఆరోపణలు రుజువు కాలేదన్నారు. రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలబోతున్నానని జోస్యం చెప్పారు. తనపై సోషల్ మీడియాలో వచ్చే కథనాలు అవాస్తవమని చెప్పారు. సీఎం కేసీఆర్ తనకు మంథని టికెట్ కేటాయించడంతో ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని పేర్కొన్నారు. తాను తప్పు చేసి ఉండి ఉంటే సీఎం కేసీఆర్ టికెట్ ఎందుకు ఇస్తారని పుట్టమధు ప్రశ్నించారు.

Advertisement
Next Story