- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
హైదరాబాద్ గచ్చిబౌలిలో కిడ్నాప్ కలకలం.. రూ. 4 కోట్లు డిమాండ్
దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో కిడ్నాప్ కలకలం రేగింది. ఎస్‌ఓటీ పోలీసులమంటూ వచ్చి ఓ కంపెనీ ఎండీతో పాటు సేల్స్ కో-ఆర్డినేటర్‌ను దుండగులు కిడ్నాప్ చేశారు. డీఎల్ఎఫ్ వద్ద ఓ కంపెనీ నిర్వహిస్తున్న సాయి గుప్తను గౌతమ్ భవిరిశెట్టి అనే వ్యక్తి కిడ్నాప్ చేయించాడు. గతంలో ఇద్దరు కలిసి ఫైనాన్స్ వ్యాపారం చేసినట్లు గుర్తించారు. లావాదేవీల విషయంలో కొన్నాళ్లుగా ఇద్దరి మధ్య వివాదం జరుగుతుంది. శుక్రవారం కారులో ఇంటికి వెళ్తున్న సాయి గుప్త, కోఆర్డినేటర్ సతీష్ రెడ్డిని గౌతమ్ కిడ్నాప్ చేయించాడని ఆరోపణలు వస్తున్నాయి.
జగద్గిరిగుట్ట లోని ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి రూ. 4 కోట్లు ఇవ్వకపోతే చంపేస్తామని బెదిరించారు. అక్కడి నుంచి వికారాబాద్‌లోని మరోప్రాంతానికి తరలించారు. శనివారం పీఎస్‌లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా.. పోలీసులు తమపై నిఘా పెట్టినట్టు గ్రహించి ఇద్దరినీ వికారాబాద్‌లో వదిలేసి దుండగులు పరారయ్యారు. గౌతమ్, మరో 13 మంది దాడి చేసినట్లు బాధితులు వెల్లడించారు. ఈ క్రమంలోనే గౌతమ్‌ని పోలీసులు అదుపులోకి తీసుకోని విచారిస్తున్నారు.