భవనంపై నుంచి దూకి ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య..

by Kalyani |
భవనంపై నుంచి దూకి ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య..
X

దిశ, మియాపూర్: భవనం పైనుంచి దూకి ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకొన్న సంఘటన మియాపూర్ పొలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ రాఘవేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. వేగుంట సునీల్ చౌదరీ, గీత లావణ్య దంపతుల కుటుంబంతో మియాపూర్ రెడ్డి కాలనీలో నివాసం ఉంటున్నారు. వారి కూతురు లాస్య చౌదరి (16), వికాస్ కళాశాల లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుంది. లాస్య చౌదరీ బుధవారం తెల్లవారు జామున ఉదయం 4 గంటలకు చదువుకోవడానికి వారు ఉంటున్న రెండో అంతస్తు పైన ఉన్న టెర్రస్ పైకి వెళ్లింది.

తిరిగి ఉదయం 5 గంటలకు తల్లి గీత లేచింది. కింది నుంచి ఏదో మూలుగుతున్న శబ్దం రావడంతో అనుమానంతో కిందికి చూసే వరకు లాస్య తలకు తీవ్ర రక్తస్రావమై పడి ఉన్నది. దీంతో స్థానికుల సాయంతో వెంటనే దగ్గరలో ఉన్న బాచుపల్లిలోని ఓ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మియాపూర్ పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతురాలి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story