పాతబస్తీలో రెచ్చిపోయిన గంజాయి గ్యాంగ్.. విద్యార్ధిపై దాడి

by Vinod kumar |
పాతబస్తీలో రెచ్చిపోయిన గంజాయి గ్యాంగ్.. విద్యార్ధిపై దాడి
X

దిశ, చార్మినార్: పాతబస్తీలో గంజాయి గ్యాంగ్ ​రెచ్చిపోయింది. నమాజ్​ముగించుకుని ఇంటికి వెళ్తున్న 10వ తరగతి విద్యార్థిని అడ్డగించి బలవంతంగా ఇంట్లోకి తీసుకువెళ్లారు. అక్కడ విద్యార్థిపై దాడి చేసి, మత్తు ఇంజెక్షన్ ఇవ్వడానికి ప్రయత్నించగా తప్పించుకున్న విద్యార్థి ఫలక్​నుమా పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. పాతబస్తీ జహనుమా కు చెందిన 10వ తరగతి విద్యార్థి ఆదివారం రాత్రి ప్రత్యేక ప్రార్థనల కోసం మసీదుకు వెళ్లాడు.

అక్కడ ప్రార్థనలు ముగించుకుని తిరిగి వస్తుండగా మార్గమధ్యలో మదీనా కాలనీలో మత్తులో ఉన్న ఓ యువకుడు 10వ తరగతి విద్యార్థిని అడ్డగించి, ఇంట్లోకి తీసుకువెళ్లాడు. అక్కడ ఉన్న నలుగురు ఉండడంతో ఇంట్లోకి తీసుకువెళ్లిన వ్యక్తి సదరు విద్యార్థిపై దాడి చేశాడు. అంతేగాకుండా చేతికి మత్తు ఇంజెక్షన్​ఇవ్వబోయారు. ఎవ్వరికన్నా చెబితే చంపేస్తామని బెదిరించారు. వారి నుంచి తప్పించుకున్న సదరు విద్యార్థి తన సోదరుడుతో కలిసి ఫలక్​నుమా పోలీస్​స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

Next Story

Most Viewed