డ్రీం ఫర్ గుడ్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రతి రోజు ఉచితంగా అల్పాహారం : శేరిలింగంపల్లి ఎమ్మెల్యే

by Aamani |
డ్రీం ఫర్ గుడ్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రతి రోజు ఉచితంగా అల్పాహారం : శేరిలింగంపల్లి ఎమ్మెల్యే
X

దిశ, శేరిలింగంపల్లి : మాదాపూర్ డివిజన్ గోకుల్ ప్లాట్స్ లో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థుల కు డ్రీం ఫర్ గుడ్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచితంగా ఉదయం పూట అల్పాహారం( బ్రేక్ ఫాస్ట్ ) అందించే కార్యక్రమాన్ని బుధవారం శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ అరెకపూడి గాంధీ సంస్థ నిర్వహకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ చిన్న పిల్లలకు అల్పాహారం అందించేందుకు డ్రీం ఫర్ గుడ్ సొసైటీ వారు ముందుకు రావడం అభినందనీయమన్నారు.

పిల్లలు ఉదయం పూట ఇంటి దగ్గర తినకుండా రావడంతో ఆకలితో స్కూల్ కి వచ్చి ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు సరిగ్గా వినకుండా చాలా ఇబ్బంది పడుతుంటారని, అంతే కాకుండా సరైన పోషకాలు అందకుండా అర్ధాకలితో అలమటిస్తుంటారని, అటువంటి వారికి ఇది ఎంతో ఉపయోగం కలుగుతుందని అన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు చక్కగా ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎర్ర గుడ్ల శ్రీనివాస్ యాదవ్ తో పాటు డ్రీం ఫర్ గుడ్ సొసైటీ వ్యవస్థాపకురాలు చావా అరుణ, సభ్యులు కళ్యాణి, పద్మావతి, విజయలక్ష్మి, ఏఐజీ డాక్టర్స్ కళ్యాణ్, రోహిత్ తో పాటు కాలనీ వాసులు బ్రిక్ శ్రీను, గుమ్మడి శ్రీను, సాంబయ్య, పితాని శ్రీనివాస్, గొర్రెపాటి వివేక్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed