- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Mobikwik IPO: మొబిక్విక్ ఐపీఓకు తొలిరోజు అనూహ్య స్పందన.. ఏకంగా 7.32 రేట్ల సబ్‌స్క్రిప్షన్..!

దిశ, వెబ్‌డెస్క్: గురుగ్రామ్(Gurugram)కు చెందిన ప్రముఖ డిజిటల్ ఆర్ధిక సేవల సంస్థ మొబిక్విక్(Mobikwik) ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్(IPO) బిడ్డింగ్ ప్రక్రియ ఈ రోజు ప్రారంభమైన(డిసెంబర్ 11) విషయం తెలిసిందే. ఐపీఓ స్టార్ట్ అయినా తొలి రోజే ఆ సంస్థకు ఇన్వెస్టర్ల(Investers) నుంచి అనూహ్య స్పందన లభించింది. కాగా మొబిక్విక్ ఐపీవో ద్వారా సుమారు రూ. 572 కోట్లను సమీకరించాలనే లక్ష్యంతో స్టాక్ మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వగా.. మొదటి రోజు 7.32 రేట్ల సబ్‌స్క్రిప్షన్(Subscription) అందుకుంది. మొత్తం 1.18 కోట్ల షేర్లకు గాను 2.17 కోట్ల షేర్లకు బిడ్లు ధాఖలయ్యాయి. క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్ల(QIB) నుంచి 75 రేట్ల సబ్‌స్క్రిప్షన్లు రాగా.. రిటైల్ ఇన్వెస్టర్ల(Retail Investors) నుంచి 10 రేట్ల సబ్‌స్క్రిప్షన్ అందుకుంది. ఇక నాన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల(NII)నుంచి ఏకంగా 15 శాతం బిడ్లు ధాఖలయ్యాయి. అయితే ఐపీఓ ద్వారా సమీకరించే నిధులను ఫైనాన్సియల్, పేమెంట్ సర్వీసెస్ గ్రోత్, మెషిన్ లెర్నింగ్, టెక్నాలజీ డెవలప్మెంట్, కార్పొరేట్ అవసరాలకు కంపెనీ వినియోగించనుంది.