Etala Rajendar : పేదల జోలికి వస్తె చూస్తూ ఊరుకోం : ఈటల రాజేందర్

by M.Rajitha |
Etala Rajendar : పేదల జోలికి వస్తె చూస్తూ ఊరుకోం : ఈటల రాజేందర్
X

దిశ, వెబ్ డెస్క్ : బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్(Etala Rajendar) మరోసారి రాష్ట్ర ప్రభుత్వం మీద విరుచుకు పడ్డారు. జవహర్ నగర్ (Javahar Nager), బాలాజీ నగర్(Balaji Nager) లో హైడ్రా(Hydra) కూల్చివేతలపై ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. హైడ్రా పేరుతో పేదల ఇళ్ళు కూల్చివేస్తే ఊరుకునేది లేదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి పరిపాలన మీద.. అధికారుల మీద మంత్రులకు పట్టు ఉందా లేదా అని ప్రశ్నించారు. అత్యంత అసమర్థ, అవినీతి, సమన్వయం లేని పాలన రేవంత్ రెడ్డి పాలన అని ఎద్దేవా చేశారు. మళ్ళీ అధికారంలోకి వస్తామో లేదో అని కాంగ్రెస్ నేతలు అందినకాడికి దండుకుంటున్నారని, అధికారుల బ్రోకర్ల లాగా మారిపోయి లంచాల కోసం ప్రజల్ని వేధిస్తున్నారని మండిపడ్డారు. పేదల జోలికి వస్తె చూస్తూ ఊరుకునేది లేదని, వారితరపున కొట్లాడటానికి దేనికైనా సిద్ధమని స్పష్టం చేశారు.

సీఎం సహ అధికారులు బీ కేర్ఫుల్ అని, ఇదేం నిజాం సర్కార్ కాదని, బాస్ ల ఆదేశాల మేరకు పనిచేసే అధికారులు, పోలీసులు మారకపోతే వారిపై చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. బీజేపీ నాయకులు పేదలకు అండగా ఉన్న చరిత్ర ఉందని, నిర్భందాలకు ఎదిరించి నిలబడ్డారని, వారి గూడు చెదరగొట్టాలని ప్రయత్నిస్తే ఖబర్ధార్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మా పార్టీ ఎదుగుదుల ఇష్టం లేనివారు అబద్దాల పుట్టిస్తారని, అలాంటి వాటిని మేము పట్టించుకోమని తెలిపారు. రాబోయే రోజుల్లో బీజేపీనీ ఓడించడం ఎవరి తరం కాదన్నారు.

Next Story