పండుగ పూట సైబర్ నేరగాళ్లు...ఫెస్టివల్ డిస్కౌంట్ ఆఫర్స్ తో టార్గెట్...

by Kalyani |
పండుగ పూట సైబర్ నేరగాళ్లు...ఫెస్టివల్ డిస్కౌంట్ ఆఫర్స్ తో టార్గెట్...
X

దిశ, సిటీక్రైం : సంక్రాంతి పండుగ వేళ సైబర్ క్రిమినల్స్ ఫెస్టివల్ ఆఫర్స్ తో మాటు వేశారని మంగళవారం తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు హెచ్చరించారు. ఈ ఫేక్ ఆఫర్స్ కు బోల్తా పడి పండుగ సంతోషాన్ని పాడు చేసుకోవద్దని పోలీసులు సూచిస్తున్నారు. గుర్తు తెలియని వాట్సాప్ కాల్స్, లింక్స్, ఇతర మెసేజ్ లకు అసలు స్పందించొద్దని సైబర్ సెక్యూరిటీ అధికారులు అలర్ట్ ను జారీ చేశారు. సైబర్ సెక్యూరిటీ అధికారులు అప్రమత్తం చేస్తున్న విషయాలు ఇలా...

*సైబర్ క్రిమినల్ బ్రాండెడ్ సంస్థలకు చెందిన ఫేక్ వెబ్ సైట్లు, లింక్ లను తయారు చేసి పంపించి భారీ డిస్కౌంట్ లు, ఆఫర్ లను ఇస్తారు.

*గిఫ్ట్ కార్డ్స్ స్కామ్ , ఫేక్ ఈ వాలెట్స్ ద్వారా గిఫ్ట్ లను కొనుగోలు చేసేలా మాయ చేస్తారు. చెల్లింపుల కోసం ఫేక్ క్యూఆర్ కోడ్ స్కానర్ లు, యాప్ లను తయారు చేసి పంపిస్తారు.

*అనుమాస్పదంగా ఉండే లింక్ లు, మెసేజ్ లు సోషల్ మీడియా, వాట్సాప్ ల ద్వారా పంపిస్తారు.

*మీకు తెలియని వారు, మీరు ప్రత్యేకంగా చూడని వారితో మీ వ్యక్తిగత, బ్యాంక్ ఖాతాలు, డెబిట్, క్రెడిట్ కార్డుల వివరాలను అడుగుతారు.

జాగ్రత్త ఇలా...

*ఎవరికి మీ వివరాలను చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా గుర్తు తెలియని వారికి అసలు చెప్పొద్దు.

*అధికారిక వెబ్ సైట్ లు, యాప్ లను మాత్రమే నమ్మాలి. అవి నిర్ధారించుకున్న తర్వాతనే వాటిలో షాపింగ్ చేయాలి.

*మీ ఫోన్ ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి, యాంటీ వైరస్ ను ఏర్పాటు చేసుకోవాలి.

*అనుమానం వస్తే వెంటనే 1930 కు కాల్ చేయాలి.

Advertisement

Next Story

Most Viewed