- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
జూబ్లిహిల్స్ లో కారు ప్రమాదానికి మద్యం మత్తే కారణం
దిశ, జూబ్లిహిల్స్ : జూబ్లిహిల్స్ లో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదం నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం ఏసీపీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ హరిప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ కేసు వివరాలను వెల్లడించారు. రిత్విక్ రెడ్డి అమెజాన్‌లో జాబ్ చేస్తున్నాడు. కొత్తగా జాబ్ రావటంతో ఆఫీస్ చూపిస్తానని స్నేహితులను తీసుకెళ్లాడు.
మద్యం మత్తులో స్నేహితులతో కలిసి అతి వేగంగా కారు నడపడం తో బైక్ పై వెళ్తున్న తారక్ రామ్ , రాజుని ఢీ కొట్టడంతో తారక్ రామ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఏసు రాజుకు తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన తర్వాత పోలీసులు పట్టుకుంటారనే భయంతో రిత్విక్‌రెడ్డి పరారయ్యాడు. స్నేహితుడు సురేష్‌రెడ్డి ఇంట్లో కారును దాచిపెట్టారు. ఈ కేసులో రిత్విక్‌రెడ్డితో పాటు వైష్ణవి, పొలుసాని లోకేశ్వర్‌రావు, బుల్లా అభిలాష్, అనికేత్‌పై కేసు నమోదు చేసినట్టు తెలిపారు.