- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ టైమ్.. రోబోటిక్ బేరియాట్రిక్ సర్జరీ సక్సెస్

దిశ, బంజారాహిల్స్: తెలుగు రాష్ట్రాల్లోనే మొట్టమొదటి సారిగా సంపూర్ణ రోబోటిక్ బేరియాట్రిక్ సర్జరీని జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రి రోబోటిక్ సర్జరీ నిపుణులు విజయవంతంగా నిర్వహించారు. స్థూలకాయ వ్యాధితో కదలలేని స్థితిలో ఉన్న 180 కిలోల బరువున్న రోగికి విజయవంతంగా రోబొటిక్ సర్జరీని నిర్వహించామని వైద్యులు తెలిపారు. సోమాలియ దేశానికి చెందిన హిబిబో అబ్దుల్లే మొహమ్మద్ కీళ్ల నొప్పులు, అనియంత్రిత మధుమేహం, పిత్తాశయంలో రాళ్లు వంటి పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిని ఆశ్రయించాడు. దీంతో ఆమెకు వైద్యులు పరీక్షలు నిర్వహించారు. ఆమె అధిక బరువుని దృష్టిలో ఉంచుకున్న వైద్యులు రోబోటిక్ సర్జరీ విధానంలో పాటు అత్యాధునికమైన డా విన్సీ ఎక్స్‌ఐ రోబోటిక్ సిస్టమ్‌ను ఉపయోగించి మూడు గంటల పాటు కష్టపడి పిత్తాశయాన్ని తొలగించినట్లు డాక్టర్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు.