- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
అమ్మ చల్లని ఒడిలా చేనేత : సుమ కనకాల

X
దిశ, ఖైరతాబాద్ : భారతీయ సంస్కృతి లో హ్యాండ్ లూమ్ వస్త్రోత్పత్తులకు ఎంతో ప్రత్యేకత ఉందని ప్రముఖ యాంకర్ సుమ కనకాల అన్నారు. జూబ్లిహిల్స్ చెక్ పోస్ట్ లోని జూబ్లీ క్రౌన్ లో జీటీ వీవ్స్ లో మనోహరి ఫెస్టివ్ కలెక్షన్స్ ను సుమ కనకాల ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లా డుతూ చేనేతకు నేటికి వన్నె తగ్గలేదని, నేటి తరం కూడా వీటిని ఎంతో ఇష్ఠంగా ధరిస్తున్నారన్నారు. ఈ చేనేత అమ్మ చల్లని ఒడి అని సుమ అభి వర్ణించారు. పర్యావరణ రహిత రంగుల చేనేత చీరలు మగువ హుందాతనాన్ని మరింత పెంచే విధంగా జీటీ తన మనసును కట్టిపడేసిందని అన్నారు. నిర్వాహకులు సౌజన్య మాట్లాడుతూ సంప్రదాయ చేనేతకు నేటి ఆధునికత జోడించి విభిన్నంగా చేనేత దుస్తులు తయారు చేస్తున్నట్టు తెలిపారు.
- Tags
- Suma Kanakala
Next Story