కారు రీమోడలింగ్ చేసి ప్రమాదకరంగా నడిపిన వ్యక్తి పై కేసు నమోదు, కారు సీజ్...

by Disha Web Desk 11 |
కారు రీమోడలింగ్ చేసి ప్రమాదకరంగా నడిపిన వ్యక్తి పై కేసు నమోదు, కారు సీజ్...
X

దిశ,జూబ్లిహిల్స్ : ఓ కారుని రీమోడలింగ్ చేసి , భారీ శబ్దాలతో ప్రజలను భయబ్రాంతులకు గురి చేసిన వ్యక్తిని అరెస్ట్​ చేసి కారను సీజ్ చేసిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. జూబ్లిహిల్స్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ మధుసూదన్ తెలిపిన వివరాల ప్రకారం.... శనివారం అర్థరాత్రి 01.40 గంటల సమయంలో TS08GN6528 (2008 మోడల్) గల పాత హోండా సివిక్ కారుని రీమోడలింగ్ చేసి , కారు రంగు, సైలెన్సర్, డోర్‌లను మార్చి, పెద్ద శబ్దాలు చేస్తూ, ప్రమాదకరంగా వాహనాలు నడుపుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న డ్రైవర్ ఎం.డి అనస్ ఆదిల్ పై కేసు నమోదు చేసి, కారుని సీజ్ చేసినట్లు జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపారు. ఎవరైనా తమ వాహనాలకు సైలెన్సర్ మార్చి , పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ ప్రజలకు అసౌకర్యం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జూబ్లీహిల్స్ ఎస్ హెచ్ ఓ వేంకటేశ్వర రెడ్డి హెచ్చరించారు.



Next Story

Most Viewed