HYD: నగరంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం..

by Sathputhe Rajesh |
HYD: నగరంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం..
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నగరంలో ఆదివారం అర్ధరాత్రి నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉరుముల శబ్దాలు చెవులు చిల్లులు పడేలా వచ్చాయి. కాసేపటికే జోరు వాన స్టార్ట్ అయింది. గచ్చిబౌలి, ముషీరాబాద్, దిల్ సుఖ్ నగర్, ఖైరతాబాద్, కుత్భుల్లాపూర్, హయత్ నగర్ లో జోరువాన కురిసింది. రాజేంద్రనగర్ లో అత్యధికంగా 5 సెం.మీ వాన కురిసింది. పలు చోట్ల చెట్లు నెలకొరిగాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు చోట్ల ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

Next Story

Most Viewed