ఆమె జీవితమే ఒక పోరాటం.. తెలంగాణ మంత్రిపై HYD CP ఆసక్తికర వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |
ఆమె జీవితమే ఒక పోరాటం.. తెలంగాణ మంత్రిపై HYD CP ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం(International Women's Day) వేళ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్(HYD CP CV Anand) కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రి సీతక్క(Minister Seethakka) ఎంతో మంది మహిళలకు ఆదర్శమన్నారు. ఆమె జీవితమే ఒక పోరాటం అని చెప్పారు. కింది స్థాయి నుంచి మంత్రిగా ఎదిగారని కొనియాడారు. హైదరాబాద్ కమిషనరేట్(Hyderabad Commissionerate) పరిధిలో 20 మందిలో డీసీపీల్లో 8 మంది మహిళా డీసీపీలు ఉన్నారు. లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీసు స్టేషన్‌లలో ఇటీవల మహిళా ఎస్‌హెచ్‌ఓలను నియమించాం.. కమిషనరేట్‌లో 18 వేల మంది పోలీసు సిబ్బందిలో 30 శాతం మంది మహిళలే ఉన్నారు.. ఇవన్నీ మహిళా ప్రోగ్రెస్‌కు నిదర్శనమని పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ చెప్పారు.


అంతకుముందు మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ పోలీస్ ఆధ్వర్యంలో పీపుల్స్ ప్లాజా(People's Plaza) నుంచి రన్ ఫర్ యాక్షన్-2025 ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దాదాపు నాలుగు వేలకు పైగా యువతీ, యువకులు పాల్గొన్నారు. మంత్రి సీతక్క, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, సీపీ CV ఆనంద్, అడిషనల్ సీపీ విక్రమ్ మాన్, అడిషనల్ సీపీ క్రైమ్స్ విశ్వ ప్రసాద్ సహా ఇతర డీసీపీలు పాల్గొన్నారు.



Next Story

Most Viewed