HYD City Police: రేపు సాయంత్రం 6 గంటలకు ముగియనున్న పార్టీల ప్రచారం.. ట్విట్టర్ వేదికగా సీపీ కీలక సూచన

by Shiva |   ( Updated:2024-05-10 12:37:15.0  )
HYD City Police: రేపు సాయంత్రం 6 గంటలకు ముగియనున్న పార్టీల ప్రచారం.. ట్విట్టర్ వేదికగా సీపీ కీలక సూచన
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం చరమాంకానికి చేరుకుంది. ఇప్పటికే పలు ప్రధాన పార్టీల అధినేతలు వరుస బహిరంగ సభలు, రోడ్డు షోలతో సుడిగాలి పర్యటలను చేస్తున్నారు. ఎన్నికల కమిషన్ ఇచ్చిన నోటిఫికేషన్ మేరకు రేపు సాయంత్రం 6 వరకు మాత్రమే ఆయా పార్టీలు ప్రచారం నిర్వహించాల్సి ఉంటుంది. క్షణం ఆలస్యమైనా వారిపై పోలీసులు కేసులు నమోదు చేయననున్నారు. ఈ క్రమంలోనే ట్విట్టర్ వేదికగా హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఆయా పార్టీలకు కీలక సూచన చేశారు. మందుగా నగర వ్యాప్తంగా ఉన్న వైన్ షాపులను రేపు సాయంత్రం 6 గంటల నుంచి మూసివేయాలని తెలిపారు.

పోలింగ్ రోజున కేవలం ఈసీ అనుమతి ఇచ్చిన వాహనాలను మాత్రమే అభ్యర్థులు ఉపయోగించాలని పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద పొలిటికల్ పార్టీలు పెట్టే అవగాహన బూత్‌లు 200 మీటర్ల బయటే ఉండాలని లేని పక్షంలో వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలింగ్ బూత్‌లోకి అభ్యర్థి మాత్రమే వెళ్లాలని.. వారి గన్‌మెన్లకు కూడా అనుమతించబోమని స్పష్టం చేశారు. అదేవిధంగా ఓటర్లు చిన్న పిల్లలను తమ వెంట పోలింగ్ కేంద్రాలకు తీసుకురావొద్దని విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story