HYD : విద్యార్థిని సూసైడ్ కలకలం

by Sathputhe Rajesh |
HYD : విద్యార్థిని సూసైడ్ కలకలం
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో విద్యార్థిని సూసైడ్ కలకలం రేపింది. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రగతినగర్ లో ఉన్న ఎక్సెల్ కాలేజీ బిల్డిండ్ పై నుంచి దూకి ప్రియాంక అనే విద్యార్థిని సూసైడ్ చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాద్రి కొత్త గూడెం జిల్లాకు చెందిన విద్య ప్రియాంక ఎక్సెల్ కాలేజీలో NEET కోచింగ్ కోసం చేరి.. హాస్టల్ లో ఉంటోంది.

అయితే సోమవారం రాత్రి 10 గంటల సమయంలో బిల్డింగ్ 4వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థినిని హాస్పిటల్ కు తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు డాక్టర్స్ తెలిపారు. డెడ్ బాడీని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Next Story

Most Viewed