తెలంగాణ రైతులకు భారీ గుడ్ న్యూస్.. అకౌంట్లలో రైతుభరోసా నిధులు జమ

by Gantepaka Srikanth |
తెలంగాణ రైతులకు భారీ గుడ్ న్యూస్.. అకౌంట్లలో రైతుభరోసా నిధులు జమ
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రైతాంగానికి(Telangana Farmers) ప్రభుత్వం భారీ శుభవార్త అందించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Redy) ఆదేశాల మేరకు బుధవారం రైతుల అకౌంట్లలో రైతుభరోసా నిధులను అధికారులు జమ చేశారు. ఈ విషయాన్ని సంబంధిత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు(Thummala Nageswara Rao) స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 17.03 లక్షల రైతుల అకౌంట్లలో నిధులు జమ చేసినట్లు తెలిపారు. ప్రారంభోత్సవం నాడు విడుదల చేసిన నిధులతో కలుపుకొని ఈరోజు వరకు మొత్తం1126.54 కోట్ల నిధులు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు చెప్పారు. ఇప్పటికే రైతుబంధుకు 7625 కోట్లు, రుణమాఫీకి 20,616.89 కోట్లు, రైతుభీమాకు 3000 కోట్లు కేటాయించామని అన్నారు. పంటలకు గిట్టుబాటు ధరల కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

ఎన్నడూలేని విధంగా రూ.14,893 కోట్లతో 20,11,954 మెట్రిక్ టన్నుల పత్తిని మద్దతు ధరకు సేకరించినట్లు తెలిపారు. పత్తిపంటను పూర్తిగా సేకరించడానికి మంత్రి గడువు కోరారు. ఈ వానాకాలం రికార్డు స్థాయిలో వరి ఉత్పత్తులు ఉన్నాయని అన్నారు. ఈ యాసంగికి కూడా సన్నాలకు బోనస్ కొనసాగిస్తామని స్పష్టం చేశారు. పసుపు, మిరప పంటలకు మద్ధతు ధర నిర్ణయించడానికి కేంద్రప్రభుత్వానికి విజ్ఙప్తులు చేసినట్లు తెలిపారు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా, విత్తనాలు, ఎరువుల సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్భంది చర్యలు, కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం ఎరువుల కేటాయింపుల కోసం విజ్ఙప్తులు చేస్తున్నామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి మొదటి ప్రాధాన్యత రైతే అని మంత్రి తుమ్మల వెల్లడించారు.

👉 Download our Android App
👉Download our IOS App
👉Follow us on Instagram
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story