- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పటాన్‌చెరులో భారీ అగ్నిప్రమాదం.. ముగ్గురు కార్మికులకు సీరియస్
by GSrikanth |
X
దిశ, వెబ్‌డెస్క్: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం పాశమైలారంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. వనమాలి, సాలుబుర్స్ అనే రెండు ఫార్మా కంపెనీల్లో మంగళవారం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భారీగా ఎగిసిపడి ఆ మంటలు చుట్టుపక్కల మొత్తం వ్యాపించాయి. ఈ మంటల్లో చిక్కుకొని ముగ్గురు కార్మికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాద సమయంలో రెండు కంపెనీల్లో మొత్తం 10 మంది కార్మికులు విధుల్లో ఉన్నట్లు సమాచారం. స్థానికుల సమచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయాలైన వారిని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. ఫైరింజన్ల సాయంతో ప్రస్తుతం మంటలు ఆర్పుతున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యా్ప్తు ప్రారంభించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Next Story