- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్రేకింగ్: TSPSC పేపర్ లీకేజీ ఘటనలో బిగ్ ట్విస్ట్.. ఆ యువతి కోసమే..
దిశ, డైనమిక్ బ్యూరో: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటనలో కొత్త కోణం వెలుగు చూసింది. పేపర్ లీకేజీ దర్యాప్తులో భాగంగా హనీ ట్రాప్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పేపర్ లీకేజీకి హ్యాకింగ్ కారణం కాదని పోలీసులు నిర్ధారించారు. ఓ యువతి మాయలో పడి టీఎస్పీఎస్సీ ఉద్యోగి పేపర్ లీకేజీకి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ వ్యవహారంలో టీఎస్పీఎస్సీ సెక్రటరీ పీఏ ప్రవీణ్ కీలక నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
గతకొంత కాలంగా ఓ యువతి ప్రవీణ్‌తో సన్నిహితంగా ఉంటూ పేపర్ లీక్‌కు కారణమైందని పోలీసులు దర్యాప్తులో తేలింది. పేపర్ ఇవ్వాలని ప్రవీణ్‌ను యువతి కోరింది. ఈ నేపథ్యంలో తరచూ ప్రవీణ్‌ను కలిసేందుకు యువతి ఆఫీస్‌కు వచ్చేదని.. యువతితో సన్నిహితంగా ఉంటున్న ప్రవీణ్ ఆమె కోసమే టౌన్ ప్లానింగ్ పేపర్ లీక్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో పేపర్ లీకేజీకి హ్యాకింగ్ కారణం కాదని పోలీసులు నిర్థారించారు.
సెక్రటరీ పీఏ ప్రవీణ్‌తో సహా ఏడుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. విచారణలో మరిన్ని విషయాలు బయటపడే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది. కాగా, రాష్ట్రంలో ఇవాళ జరగాల్సిన టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ పరీక్ష పేపర్ లీక్ అయినట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. దీంతో, మూడు పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. ఇవాళ జరగాల్సిన ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ పరీక్ష, ఈ నెల 15,16 తేదీల్లో జరగాల్సిన పరీక్షలను వాయిదా వేస్తూ...పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెల్లడించిన సంగతి తెలిసిందే.