Shamshabad airport : సెండాఫ్ ఇచ్చేందుకు భారీగా ఎయిర్ పోర్టుకు పోటెత్తిన పేరెంట్స్.. భారీగా ట్రాఫిక్ జామ్

by Prasad Jukanti |
Shamshabad airport : సెండాఫ్ ఇచ్చేందుకు భారీగా ఎయిర్ పోర్టుకు పోటెత్తిన పేరెంట్స్.. భారీగా ట్రాఫిక్ జామ్
X

దిశ, డైనమిక్ బ్యూరో : శంషాబాద్ ఎయిర్‌పోర్టులో రద్దీ భారీగా పెరిగింది.. విదేశాల్లో అకడమిక్ ఇయర్ ఈ నెలలోనే ప్రారంభం కావడంతో చదువుల నిమిత్తం వెళ్తున్న విద్యార్థులు విమానాశ్రయానికి చేరుకుంటున్నారు. ఈ క్రమంలో విద్యార్థులకు సెండాఫ్ చెప్పేందుకు కుటుంబ సభ్యులు, స్నేహితులు భారీగా తరలివస్తున్నారు. దీంతో సాధారణ రోజుల్లోనే రష్‌గా ఉండే శంషాబాద్ విమానాశ్రయం మరింత రద్దీగా మారింది. విమానాశ్రయానికి వెళ్లే మార్గాల్లోనూ భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.

Next Story