Heavy Rains : ప్రభుత్వానికి వాతావరణ శాఖ కీలక సూచన

by Sathputhe Rajesh |   ( Updated:2023-07-25 06:03:52.0  )
Heavy Rains : ప్రభుత్వానికి వాతావరణ శాఖ కీలక సూచన
X

దిశ, డైనమిక్ బ్యూరో: అల్పపీడనం కారణంగా రాగల మూడు రోజుల పాటు అత్యంత భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో జూలై 27 వరకు విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వాలని వాతావరణ నిపుణుడు తెలంగాణ వెధర్‌ మ్యాన్ ప్రభుత్వానికి సూచించారు. మరో వైపు విద్యార్థుల తల్లిదండ్రులు సైతం ఈ కురుస్తున్న వర్షాలకు పిల్లలను స్కూల్‌కు పంపించే క్రమంలో ఆందోళన చెందుతున్నారు. ఆన్‌లైన్ తరగతులు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వారు కోరుతున్నారు.

ఇదిలా ఉండగా వర్షం కారణంగా నగరంలో ఇవాళ భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ముఖ్యంగా గచ్చిబౌలీ, కొండపూర్, హైటెక్‌సిటీ పరిసర ప్రాంతాల్లో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఈ నేపథ్యంలో వర్షాకాలంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఇస్తేనే ట్రాఫిక్ సమస్యకు కొంత వరకు పరిష్కారం లభిస్తుందని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ట్రాఫిక్ ఇక్కట్లు.. నెటిజన్ ప్రశ్నకు కేటీఆర్ సమాధానం

వర్షం కారణంగా ట్రాఫిక్ సమస్యలపై ఒక నెటిజన్ అడిగిన ప్రశ్నకు మంత్రి కేటీఆర్ స్పందిచారు. సిటీలో ట్రాఫిక్ కష్టాలు తగ్గేవిధంగా శాశ్వత పరిష్కారం చూపాలని, పబ్లిక్ ట్రాన్స్‌పోర్టును పెంచాలని పలువురు నెటిజన్లు మంత్రిని ఇవాళ ప్రశ్నించారు. ఈ సందర్భంగా కేటీఆర్ స్పందిస్తూ.. వచ్చే కేబినెట్‌లో హైదరాబాద్ మెట్రో రైలు పొడిగింపు అంశాన్ని ప్రధానంగా తీసుకున్నామని తెలిపారు. ఇప్పటికే ఈ సమస్యలపై సీఎం కేసీఆర్ తమ శాఖను ఆదేశించారని, ప్రస్తుతం ఆ పనుల్లోనే ఉన్నామని పేర్కొన్నారు. సస్టైనబుల్ మొబిలిటీ, షేర్డ్ మొబిలిటీ మాత్రమే అవసరమైన వృద్ధి, మౌలిక సదుపాయాల మధ్య సమతుల్యతను కొనసాగించడానికి ఏకైక పరిష్కారమని తెలిపారు.

ఇవి కూడా చదవండి :: Hyderabad :హైదరాబాద్ అల్లకల్లోలం.. భయం గుప్పిట్లో ఆ ప్రాంత ప్రజలు

Advertisement

Next Story

Most Viewed