- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
MLC కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా

దిశ, వెబ్‌డెస్క్: ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా పడింది. రేపు(బుధవారం) మధ్యా్హ్నం 2 గంటల వరకు విచారణ కొనసాగనుంది. బెయిల్ పిటిషన్‌పై సుదీర్ఘ వాదనలు వినిపించాలని ఈడీ తరపు న్యాయవాది జోయబ్ హుస్సేన్ పేర్కొన్నారు. ఈడీ వాదనల అనంతరం కౌంటర్ వాదనలు వినిపించాలని కవిత న్యాయవాదులకు ఆదేశాలు జారీ చేశారు. కాగా, కవితకు బెయిల్ ఇవ్వొద్దని ఈడీ న్యాయవాది జోయబ్ కోర్టును కోరారు. అయితే.. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ నిన్నటితో ముగిసింది.
దీంతో ఇవాళ ఆమెను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టారు. అలాగే కవిత వేసిన బెయిల్ పిటిషన్‌పై కూడా విచారణ జరిగింది. దీనిపై ఇప్పటికే ఈడీ కౌంటర్ దాఖలు చేసింది. దీంతో కవితకు బెయిల్ వస్తుందా? రాదా? అనేది ఆసక్తికరంగా మారింది. ఢిల్లీ లిక్కర్ స్కాం పాలసీలో కేజ్రీవాల్, కవిత ఇద్దరూ ప్రధాన సూత్రధారులే అని ఈడీ అధికారులు చెబుతున్నారు. అందులో భాగంగానే వీరిద్దరినీ కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు.
Read more : సెక్షన్ 19 ప్రకారమే కవితను అరెస్ట్ చేశాం: ఈడీ