- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
Harish Rao: నా హైట్ గురించి మాట్లాడటం సీఎం ఆపేయాలి
దిశ, వెబ్‌డెస్క్: ‘నా ఎత్తు గురించి మాట్లాడటం పక్కనబెట్టి.. ప్రజల సమస్యలు పరిష్కరించడంపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి పెట్టాలి. ఎంత గగ్గోలు పెట్టినా రేవంత్ రెడ్డి(Revanth Reddy) నా అంత ఎత్తుకు ఎదగలేరు. అసలు నా ఎత్తు గురించి రేవంత్‌కు ఎందుకు అంత బాధ’ అని బీఆర్ఎస్(BRS) కీలక నేత, మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) ప్రశ్నించారు. ఆదివారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. సీఎం సొంత గ్రామమైన కొండారెడ్డిపల్లిలో ముందు రుణమాఫీ పూర్తిగా అయ్యిందో లేదో కనుక్కోవాలని హితవు పలికారు. దీనిపై చర్చించేందుకు తాను సిద్ధమని రేవంత్ రెడ్డి కూడా సిద్ధమా? అని హరీష్ రావు సవాల్ చేశారు. తనను ఇష్టానుసారం తిడుతున్నారని.. రేవంత్‌ను సన్నాసి అని తాను అనలేనా? అని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో సీఎం అబద్ధాల వరద పారిస్తున్నారని విమర్శించారు. చెప్పిన విషయాన్నే పదే పదే చెబుతూ ప్రజలను కన్‌ఫ్యూజ్ చేస్తున్నారని అన్నారు.
ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తానని అన్నారు. మాట తప్పిన సన్నాసులు ఈ ప్రభుత్వ పెద్దలు కాదా? అని హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏం చేసినా, ఏం మాట్లాడినా తాము ఇంతకాలం ఓపిక పట్టామని.. కానీ ఓపికకు కూడా ఓ హద్దు ఉంటుందని అన్నారు. వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పి.. ప్రజలను మభ్యపెట్టారని మండిపడ్డారు. రుణమాఫీపై సీఎం ఒక మాట మాట్లాడితే.. మంత్రులు తలో మాట మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. అనేక మందికి ఇంకా రుణమాఫీ కావాల్సి ఉందని.. కానీ, సీఎం మాత్రం ఇప్పటికే రుణమాఫీ ప్రక్రియ పూర్తిచేసినట్లు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. సీఎం పదవిలో ఉన్నప్పుడు హుందాగా వ్యవహరించాలని హితవు పలికారు. తనను ఎక్కడ దాక్కున్నావ్ అని అడుగుతున్నారు.. నేను సీఎం గుండెళ్లోనే ఉన్నారని హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఫార్మాసిటీ పేరుతో భూములు సేకరించారు. ఆ భూముల్లో ఫోర్త్ సిటీ అంటూ డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో రెండోసారి గెలిచే సీన్ కాంగ్రెస్‌కు లేదని అన్నారు.