Harish Rao : భట్టి విక్రమార్కకు హరీష్ రావు సవాల్

by M.Rajitha |
Harish Rao : భట్టి విక్రమార్కకు హరీష్ రావు సవాల్
X

దిశ, వెబ్ డెస్క్ : మహబూబ్ నగర్లో బీఆర్ఎస్ నిర్మించిన ప్రాజెక్టుల గురించి చర్చకు రావాలని బీఆర్ఎస్ నేత హరీష్ రావు(Harish Rao) సవాల్ విసిరారు. భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) గోబెల్స్(Gobels) ను మించిపోతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో మహబూబ్ నగర్ జిల్లాలో ఒక్క ప్రాజెక్టు పూర్తి కాలేదు, ఒక్క ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేదని అబద్దాలు చెప్తున్న భట్టి గారు.. పాలమూరులో తాము అధికారంలో ఉన్నపుడు కట్టిన ప్రాజెక్టులపై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వంగా ప్రచారం చేసుకోవడమే తప్ప రైతులకు చేసింది ఏమీ లేదంటూ విమర్శలు చేశారు. ఎకరం లోపు భూమి ఉన్నవారిని కూడా రైతులుగా గుర్తించి రూ.12 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.



Next Story

Most Viewed