రాజకీయాల్లోకి రావడంపై మహేష్ బాబు హీరోయిన్ రియాక్షన్ ఇదే.. దాని విలువ ఏంటో తెలిసిందంటూ ట్వీట్

by Hamsa |
రాజకీయాల్లోకి రావడంపై మహేష్ బాబు హీరోయిన్ రియాక్షన్ ఇదే.. దాని విలువ ఏంటో తెలిసిందంటూ ట్వీట్
X

దిశ, సినిమా: ఒకప్పటి హీరోయిన్ ప్రీతి జింటా(Preity Zinta)కు పరిచయం అక్కర్లేదు. తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu), వెంకటేష్ (Venkatesh)వంటి స్టార్స్ సరసన నటించింది. ఇక బాలీవుడ్‌లో ఎన్నో హిట్ సినిమాలు చేసిన ఆమె గత కొద్ది కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటోంది. కానీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ పలు పోస్టులతో వార్తలో నిలుస్తోంది. అలాగే ప్రీతి జింటా ఐపీఎల్‌లో పాల్గొంటూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలో.. తాజాగా, ఓ నెటిజన్ ఆమెను రాజకీయాల్లోకి వస్తున్నారా అందుకే దేవాలయాలకు తిరుగుతున్నారు. భాజపా పార్టీలో చేరుతున్నారా? అని ప్రశ్నించాడు. ఇక దీనికి ఆమె సీరియస్ అయింది.

ఈ విషయంపై ఆమెపై విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ప్రీతి జింటా ఓ ట్వీట్ పెట్టింది. ‘‘నేను ఓ నెటిజన్‌కు చెప్పిన సమాధానం కఠినంగా అనిపించింది కాబట్టి క్షమాపణులు కోరుతున్నాను. సోషల్ మీడియాతో వచ్చే ఇబ్బంది ఇదే. ఎలా మాట్లాడినా తప్పుగా తీసుకుంటారు. ప్రతి ఒక్కరూ జడ్జ్ చేస్తారు. అయితే నేనే ఏ పార్టీలో చేరడం లేదు. విదేశాల్లో ఉన్న సమయంలో దేశం విలువ ఏంటో తెలిసింది. ప్రస్తుతం నేను భారత్‌ను భారతీయ సంస్కృతిని గౌరవిస్తున్నా. నా పిల్లలు సరం భారతీయులేనని మర్చిపోకుండా పెంచుతున్నా.

వారిని హిందువులుగానే పెంచేందుకు ప్రయత్నిస్తున్నా. అయినప్పటికీ నా మీద విమర్శలు వస్తున్నాయి. నా పిల్లలకు నేను మూలాల, మతం గురించి చెప్తున్నందుకు గర్వపడుతున్నా’’ అని రాసుకొచ్చింది. ఇక దీనిపై ఓ నెటిజన్ మీరు పూర్తిగా వివరించినందుకు ధన్యవాదాలు మేడమ్. నా ప్రశ్న ఎప్పుడూ జడ్జ్ చేసేలా ఉండదు. మీరు ఇటీవలి చేసిన ట్వీట్లు, బహిరంగ ప్రదర్శనలు రాజకీయ సమలేఖనాలతో ముడిపడి ఉన్నాయని, ముఖ్యంగా నేటి వాతావరణంలో బాగా అనుసరించే వ్యక్తిగా నేను గమనించాను. నేను పూర్తిగా ఉత్సుకతతో అడిగాను. విమర్శించడానికి కాదు. కానీ మీ సమాధానం నా ప్రశ్నకు మీరు ఉలిక్కిపడినట్లు అనిపించింది’’ అని అన్నాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.



Next Story

Most Viewed