- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Harish Rao: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు.. హరీష్‌రావు సెన్సేషనల్ ట్వీట్

దిశ, వెబ్‌డెస్క్: ఆయన వెళ్లేసరికి ఏసీపీ (ACP) అక్కడి నుంచి వెళ్లిపోవడం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అనుచరులతో కలిసి స్టేషన్‌లో హంగామా చేశారు. అయితే, తమ విధులకు భంగం కలిగిస్తున్నారంటూ పోలీసులు కౌశిక్‌రెడ్డి (Koushik Reddy), అనుచరులపై కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే కౌశిక్‌రెడ్డి కేసు నమోదు చేయడం పట్ల మాజీ మంత్రి, సిద్దిపేట్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) తన ‘X’ (ట్విట్టర్) ఖాతాలో సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping)పై ఫిర్యాదు చేసేందుకు బంజారాహిల్స్ (Banjara Hills) పోలీసు స్టేషన్‌కు వెళ్లిన ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి (MLA Koushik Reddy)పై కేసు నమోదు చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఒక ప్రజాప్రతినిధి ఇచ్చిన ఫిర్యాదు నమోదు చేసేందుకు వెనుకడుతారు.. మళ్లీ ఉల్టా కేసు బనాయిస్తున్నారని మండిపడ్డారు. ఇదేం విడ్డూరం.. ఇదెక్కడి న్యాయం.. ఇదేక్కడి ప్రజాస్వామ్యమని ప్రశ్నించారు. రేవంత్ (Revanth) మీ పాలన మార్పు మార్కు ఇదేనా.. అని ఆక్షేపించారు. రాజ్యాంగాన్ని కాపాడుదామని రాహుల్ గాంధీ (Rahul Gandhi) రాజ్యాంగం చేతిలో పట్టుకుని తిరుగుతాడని.. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో అడుగడుగునా రాజ్యాంగ ఉల్లంఘన చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ప్రజల తరుపున పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ (BRS) నాయకులపై అక్రమ కేసులు పెడతామంటే అదిరేది లేదు.. బెదిరేది లేదన్నారు. ప్రజాక్షేత్రంలో రేవంత్‌ను నిలదీస్తూనే ఉంటామని.. ఆయన వెంట పడుతూనే ఉంటామని హరీశ్ రావు ట్వీట్ చేశారు.