పిచ్చి తగలెయ్య .. కల్లు, విస్కీతో మంగళ స్నానాలు (వీడియో)

by Prasad Jukanti |
పిచ్చి తగలెయ్య .. కల్లు, విస్కీతో మంగళ స్నానాలు (వీడియో)
X

దిశ, డైనమిక్ బ్యూరో:ప్రస్తుత కాలంలో పెళ్లికి సంబంధించిన ఆచార వ్యవహారాల్లో కొత్త అలవాట్లు వచ్చి చేరుతున్నాయి. చాలా కాలంగా పెళ్లికి ముందు వధూవరులకు మంగళ స్నానాలు చేయించడం ఆనవాయితే అయినా ఇటీవల కాలంలో మ్యారేజీ ఈవెంట్ లో హల్దీ ఫంక్షన్ ఓ ట్రెండ్ గా మారిపోయింది. దీంతో రోజుకో కొత్త వెరైటీలతో ఇతరుల కంటే భిన్నంగా తమ హల్దీ ఫంక్షన్ ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ పెళ్లి కొడుకు మిత్రులు మాత్రం తన స్నేహితుడికి మంగళస్నానం చేయించిన తీరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మామూలుగా పసుపు నీటితో మంగళస్నానాలు చేయిస్తారు. కానీ ఇక్కడ పెళ్లి కొడుకు స్నేహితులు మాత్రం పసుపు నీటికి బదులు కల్లు, విస్కీతో మంగళ స్నానం చేయించి తమ మిత్రుడిని చిల్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు మీ పిచ్చి తగలెయ్య అని కొందరు కామెంట్స్ చేస్తుంటే.. ఇదో కొత్త ట్రెండ్ అంటూ ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. కాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని ఓ యువకుడి పెళ్లికి సంబంధించినది అని తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed