- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ముగిసిన రెండో రౌండ్ కౌంటింగ్.. భారీ మెజార్టీతో తీన్మార్ మల్లన్న
దిశ, వెబ్ డెస్క్: నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రులు ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. నల్లగొండలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రంలో భారీ ఏర్పాటు చేయగా.. ఇప్పటి వరకు రెండు రౌండ్ల కౌంటింగ్ పూర్తి కాగా 14, 672 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్(తీన్మార్ మల్లన్న) నిలిచాడు. రెండో రౌండులో ఆయనకు 7,002 ఓట్ల ఆధిక్యం వచ్చింది. మొత్తంగా చూసుకుంటే రెండో రౌండ్ ఓట్లలో మల్లన్నకు 34,575 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డికి 27,573 ఓట్లు వచ్చాయి. అలాగే బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి 12, 841 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థి అశోక్ కు 11,018 మొదటి ప్రాధాన్యత ఓట్లు వచ్చాయి. ఇప్పటి వరకు లక్ష 92 వేల మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తవ్వగా.. రెండు రౌండ్లలో కలిపి మల్లన్నకు 70,785 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి 56,113 ఓట్లు వచ్చాయి. ప్రేమేందర్ రెడ్డి కి 24,236 ఓట్లు వచ్చాయి. కాగా ఇంకా లక్ష 44 వేల ఓట్లు లెక్కించాల్సి ఉంది.