ఫ్లాష్.. ఫ్లాష్.. తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్

by Nagaya |   ( Updated:2022-11-26 05:39:43.0  )
ఫ్లాష్.. ఫ్లాష్.. తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో 9168 గ్రూప్​ –4 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతిచ్చింది. టీఎస్​ పీఎస్సీ నుంచి డైరెక్ట్​ రిక్రూట్​మెంట్​ ద్వారా ఈ 9,168 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు పోస్టుల భర్తీకి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసినట్లు మంత్రి హరీశ్‌రావు ట్విట్టర్​ ద్వారా తెలిపారు. గతంలో గ్రూప్​ –1 కింద 5‌‌03, గ్రూప్​ –2 కింద 663, గ్రూప్​ –3 కింద 1373 పోస్టులకు కూడా ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. వీటిలో గ్రూప్ –1 కు మాత్రమే టీఎస్​ పీఎస్సీ నోటిఫికేషన్​ జారీ చేసింది. మిగిలిన వాటిపై మార్పులు, చేర్పులపైనే కాలం వెళ్లదీస్తున్నారు. ఇటీవల కొన్ని పోస్టులను గ్రూప్​ –2, 3 కిందకు చేర్చారు. గ్రూప్​ –4 లో కూడా కొన్ని పోస్టులను కలిపారు. కానీ, గ్రూప్​ –4 కింద జూలై వరకు గుర్తించిన పోస్టులకే ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. కొత్తగా మార్చిన పోస్టులను కలుపలేదు. టీఎస్​ పీఎస్సీ ఆధ్వర్యంలో మొత్తం ఇప్పటి వరకు 2910 పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. కాగా, రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వార్డు ఆఫీసర్ల పోస్టులను భర్తీ చేసేందుకు ఎట్టకేలకు ఫైనాన్స్​ నుంచి అనుమతి వచ్చింది. వార్డు ఆఫీసర్ల స్థానాల్లో 1862 పోస్టులను భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. అయితే, ఈ స్థానాల్లో వీఆర్​ఏ, వీఆర్​ఏలను నియమించేందుకు పరిశీలించారు. కొన్నిచోట్ల వీఆర్​ఓలను సర్దుబాటు చేశారు. ఇంకా 200కుపైగా పోస్టులను వీఆర్​ఓలతో భర్తీ చేయాలని భావించారు. కానీ, ఈసారి ఆర్థిక శాఖ మాత్రం కొత్తగా వార్డు ఆఫీసర్ల పోస్టులకు ఆమోదం ఇచ్చింది.

గ్రూప్​ –4 కింద ఫైనాన్స్​ డిపార్ట్​మెంట్​ లో 191, జూనియర్​ అసిస్టెంట్​ 429, మున్సిపల్​ అడ్మినిస్ట్రేషన్​, అర్బన్​ డెవలప్​మెంట్​ లో 238, జూనియర్​ అసిస్టెంట్స్​ 6859, వ్యవసాయ శాఖలో 44, పశు సంవర్థక శాఖలో 2, బీసీ వెల్ఫేర్​ లో 307, సివిల్​ సప్లైలో 72, ఎనర్జీ వింగ్​ లో 2, ఫారెస్ట్​ డిపార్ట్​మెంట్​ లో 23, ఫైనాన్స్​ లో 46, జీఏడీలో 5, వైద్యారోగ్య శాఖలో 338, హయ్యర్​ ఎడ్యుకేషన్​ లో 742, పోలీస్​ శాఖలో 133, పరిశ్రమల శాఖలో 7, ఇరిగేషన్​ లో 51, కార్మిక శాఖలో 128, మైనార్టీ వెల్ఫేర్​ లో 191, మున్సిపల్​ అడ్మినిస్ట్రేషన్​ లో 601, పంచాయతీరాజ్​ లో 1245, రెవెన్యూ శాఖలో 2077, ప్లానింగ్​ లో 2, ఎస్సీ డెవలప్​మెంట్​ లో 474, సెకండరీ ఎడ్యుకేషన్​ లో 97, రవాణా శాఖలో 20, ట్రైబల్​ వెల్ఫేర్​ లో 221, మహిళా, శిశు సంక్షేమ శాఖలో 18, టూరిజం అండ్​ యూత్​ డిపార్ట్​మెంట్​ లో 12, అడిట్​ లో 18, మున్సిపల్​ అడ్మినిస్ట్రేషన్​ లో వార్డు ఆఫీసర్ల భర్తీ కోసం 1862 పోస్టులను భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది.

Advertisement

Next Story

Most Viewed