- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Good News: విద్యార్థులకు తీపికబురు.. నేరుగా ఖాతాల్లోకి డబ్బులు

దిశ, వెబ్‌డెస్క్: విద్యార్థులకు తెలంగాణ సర్కార్ (Telangana Government) గుడ్ న్యూస్ చెప్పింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అందిస్తున్న ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్ (Pre Matric Scholarship) నగదు జమను మరింత సులభతరం చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి డబ్బును నేరుగా విద్యార్థి లేదా తల్లిదండ్రుల ఖాతాల్లోనే జమ చేయనుంది. ప్రభుత్వ (Government), ప్రైవేటు (Private) స్కూళ్లలో 9వ తరగతి, 10వ తరగతి చదువుతోన్న డే స్కాలర్లకు ఏడాదికి రూ.3,500, హాస్టళ్లలో ఉండే వారికి రూ.7 వేలు ఇవ్వనున్నారు. అదేవిధంగా మురికివాడల్లో (Slums) నివసించే కార్మికుల పిల్లలకు 1వ తరగతి నుంచి 10వ తరగతి వారికి రూ.3,500, హాస్టళ్లలో ఉంటూ 3వ తరగతి నుంచి 10వ తరగతి చదివే వారికి సంవత్సరానికి రూ.8వేలు వారి ఖాతాల్లో జమ చేయనున్నారు.
కాగా, కేంద్ర ప్రభుత్వం (Central Government), రాష్ట్ర ప్రభుత్వాలు (State Government) SC, ST, OBC, జనరల్, మైనారిటీలు, EBC సహా వివిధ వర్గాలకు చెందిన విద్యార్థులకు ప్రీ-మెట్రిక్ స్కాలర్‌షిప్ (Pre Matric Scholarship)లను అందిస్తున్నాయి. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠశాల విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు స్కాలర్‌షిప్‌నకు అర్హులు. ప్రీ-మెట్రిక్ స్కాలర్‌షిప్ యొక్క ముఖ్య లక్ష్యం ఆర్థిక సాయం అందజేయడంతో విద్యార్థులలో పాఠశాల విద్య స్థాయిని ప్రోత్సహించడం, తద్వారా పాఠశాల డ్రాప్-అవుట్ రేటును తగ్గించడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన ఉద్దేశం. ప్రీ-మెట్రిక్ స్కాలర్‌షిప్‌ను అందించే రాష్ట్రాల్లో అస్సాం, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, మహారాష్ట్ర, తెలంగాణ, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, నాగాలాండ్, త్రిపుర, మణిపూర్ రాష్ట్రాలు ఉన్నాయి.