Crop Loans : రైతులకు సర్కార్ గుడ్ న్యూస్.. జిల్లాల వారీగా రుణమాఫీ వివరాలు ఇవే

by Ramesh N |
Crop Loans : రైతులకు సర్కార్ గుడ్ న్యూస్.. జిల్లాల వారీగా రుణమాఫీ వివరాలు ఇవే
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో రైతులకు రేవంత్‌ సర్కార్‌ ఇవాళ మరో గుడ్‌న్యూస్‌ చెప్పింది. రెండు విడత రుణమాఫీ లో భాగంగా లక్షన్నర లోపు ఉన్న వారికి రుణమాఫీ చేసింది. సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం ఈ రుణమాఫీని అసెంబ్లీ ప్రాంగణంలో విడుదల చేశారు. 6 లక్షల 40 మంది రైతులకు రూ.6 వేల 191 కోట్ల నిధులు ప్రభుత్వం జమ చేసింది. మొత్తం రెండు విడతల్లో కలిపి 17 లక్షల 75 వేల 235 మంది రైతలకు లబ్ధి చేకూరింది. రెండు విడతల్లో 12 వేల 224 కోట్లు జమ చేశారు.

జిల్లాల వారీగా రుణమాఫీ పొందిన వారి వివరాలు..

నల్లగొండ జిల్లాలో 51,515 రైతుల ఖాతాల్లో 514 కోట్లు జమ చేసింది. నాగర్ కర్నూల్ జిల్లాలో 32, 406 రైతుల ఖాతాల్లో 312 కోట్లు, సంగారెడ్డి జిల్లాలో 27, 249 రైతులకు 286 కోట్లు విడుదల చేసింది. సిద్దిపేట జిల్లాలో 27, 875 రైతులకు 277 కోట్లు, సూర్యాపేట జిల్లాలో 26, 437 రైతులకు 250 కోట్లు కేటాయింపు జరిగింది. ఖమ్మం జిల్లాలో 33, 942 రైతులకు 262 కోట్లు, రంగారెడ్డి జిల్లాలో 24 వేల ఏడు మంది రైతులకు 229 కోట్లు, మెదక్ జిల్లాలో 22, 850 మంది రైతులకు 216 కోట్లు విడుదల అయింది. ఇక వికారాబాద్ జిల్లాలో 23, 912 మంది రైతులకు 240 కోట్లు రిలీజ్ చేసింది. మహబూబ్‌నగర్ జిల్లాలో 22, 253మంది రైతులకు 219 కోట్లు, నిజామాబాద్ జిల్లాలో 23, 769 మంది రైతులకు 219 కోట్లు, కరీంనగర్ జిల్లాలో 21, 785 మంది రైతులకు 207 కోట్లు సర్కార్ విడుదల చేసింది. కామారెడ్డి జిల్లాలో 24, 816 మంది రైతులకు 211 కోట్లు, నిర్మల్ జిల్లాలో 18, 728 మంది రైతులకు 196 కోట్లు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 18, 127 మంది రైతులకు 177 కోట్లు విడుదల చేశారు. జగిత్యాల జిల్లాలో 17, 903 మంది రైతులకు 169 కోట్ల రుణమాఫీ కింద ప్రభుత్వం రిలీజ్ చేసింది.

Advertisement

Next Story