గుజరాత్‌లో గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్

by Mahesh |
గుజరాత్‌లో గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్
X

దిశ, తెలంగాణ బ్యూరో : గుజరాత్ రాష్ట్రం గాంధీనగర్ లోని మహాత్మ మందిర్ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్ లో ఈనెల 16 నుంచి 18వ తేదీ వరకు నాలుగో గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ అండ్ ఎక్స్‌పో జరగనుంది. మూడ్రోజుల పాటు జరిగే ఈ మీట్ ను ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, దేశీయ మరియు విదేశీ పెట్టుబడిదారులు ఈ సమావేశానికి హాజరవుతారు. కాగా ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హాజరవుతున్నారు. ఆదివారం సాయంత్రం ఆయన శంషాబాద్ నుంచి గుజరాత్ కు వెళ్లారు. కాగా తెలంగాణకు చెందిన పలు స్టాల్స్ ను ఇప్పటికే అక్కడ సిద్ధం చేశారు. వాటిని ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫారూఖీ, ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి పరిశీలించారు.

Advertisement

Next Story

Most Viewed