తెలంగాణ గజల్‌ దిగ్గజం ఇందిర భైరి కన్నుమూత

by Satheesh |
తెలంగాణ గజల్‌ దిగ్గజం ఇందిర భైరి కన్నుమూత
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రముఖ గజల్ రచయిత్రి ఇందిర భైరి ఆదివారం అనారోగ్యంతో మరణించారు. వందల సంఖ్యలో గజల్స్​‍రాసిన ఇందిరా భైరి.. తెలంగాణ గజల్‌ దిగ్గజంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె స్వగ్రామం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, భర్త ఉద్యోగరీత్యా హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. తెలంగాణ గజల్‌ కావ్యం, సవ్వడి, గజల్‌ భారతం, మన కవులు వంటి గజల్స్​‍సంకలనాలు ఆమెకు విశేష పేరును తీసుకొచ్చాయి. రావి రంగారావు సాహిత్య కళాపీఠం నుంచి 'జనరంజక కవి పురస్కారం' సైతం ఆమె అందుకున్నారు. మహిళా గజల్స్​‍రచయితల్లో తొలిసారిగా గజల్స్​‍సంకాలను విడుదల చేసి చరిత్ర సృష్టించారు.

హెడ్‌మాస్టర్‌గా పనిచేస్తూనే తీరిక సమయాల్లో వందల సంఖ్యలో గజల్స్​రాశారు. బతుకమ్మ, తెలంగాణ అమరవీరులు, ఉద్యమ నేపథ్యం, సాయుధ పోరాటం, మన పండుగలపై ఇందిరభైరి అనేక గజల్స్ రాశారు. ఆమె కూతురు సైతం ప్రముఖ గజల్స్​‍కళాకారిణి హిమజా రామమ్‌. ఈ తల్లీబిడ్డలు కలిసి తెలంగాణ గజల్స్​‍సాహిత్యానికి విశేష కృషి చేశారు. నిజాంపేటలో ఆమె అంత్యక్రియలు జరుగనున్నాయి.

Advertisement

Next Story

Most Viewed