- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
లిక్కర్ స్కాంలో మరొకరి అరెస్ట్
X
దిశ, డైనమిక్ బ్యూరో : ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణంలో వ్యాపారవేత్త గౌతమ్ మల్హోత్రాను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం అరెస్టు చేసింది. మద్యం విధానంలో మార్పులకు కీలకపాత్ర వహించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న గౌతమ్ మల్హోత్రాను ఈడీ అరెస్టు చేసింది. లిక్కర్ స్కాం కేసులో నేడు ఇది రెండో అరెస్ట్. ఇప్పటికే సీబీఐ అధికారులు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాజీ సీఏ గోరంట్ల బుచ్చిబాబును అరెస్టు చేశారు. ఢిల్లీకి చెందిన బ్రిండ్‌కో సేల్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్‌గా గౌతమ్ మల్హోత్రా వ్యవహరిస్తున్నాడు. మల్హోత్రాను అరెస్టు చేసిన ఈడీ అధికారులు ఈరోజు మధ్యాహ్నం తర్వాత సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచి, అతడిని కస్టోడియల్ రిమాండ్‌కు ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరనున్నట్లు తెలుస్తోంది. ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసులో ఇప్పటివరకు గౌతమ్ ఈడీ ఏడో అరెస్ట్.
Advertisement
Next Story