- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఫాక్స్ కాన్ కంపెనీ ఓ భారీ స్కాం: బక్క జడ్సన్ సంచలన ఆరోపణలు
దిశ, డైనమిక్ బ్యూరో: రంగారెడ్డి జిల్లా కొంగర కలాన్‌లో ఏర్పాటుకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేసిన ఫాక్స్ కాన్ కంపెనీ ఓ భారీ కుంభకోణం అని కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ ఆరోపించారు. ఇదంతా 200 ఎకరాల భూమిని అక్రమంగా కాజేయడానికి సీఎం కేసీఆర్ కుమారుడు మంత్రి కేటీఆర్ వేసిన ఎత్తుగడ అని అన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం సీబీఐకి ఫిర్యాదు చేశారు.
ఈ ప్రాజెక్టుకు సంబంధించి డీపీఆర్ ఇప్పటి వరకు ప్రభుత్వం ఇవ్వలేదని ఈ కంపెనీ వెనుక బీఆర్ఎస్ యూకే ఎన్ఆర్ఐ సలహాదారుడు ఉన్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇతను కేటీఆర్, కవితకు సన్నిహితుని ఎన్నికల ఏడాదిలో పలు కంపెనీలతో కుమ్మక్కై క్విడ్ ప్రో స్కీమ్ కిం ఈ ప్రభుత్వం అనుమతులు మంజూరు చేస్తోందని ఆరోపించారు.
400 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేస్తున్న ఈ కంపెనీ 34,000 మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం చెబుతోందని కానీ ఈ సంస్థకు అంత సామర్థ్యం లేదని బ్యాంకులను మోసం చేయడాని ఇదంతా కుట్ర అని ఆరోపించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ ప్రభుత్వం బయట పెట్టడం లేదని అన్నారు. అసలు ఈ సంస్థ ఉత్పత్తుల విక్రయాలు, గత ఐదేళ్లుగా ఈ సంస్థ ఆర్థిక నివేదికలు, మొత్తం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు, ఆర్ఓసీ, హైదరాబాద్‌లో దాని రిజిస్ట్రేషన్, ఎన్ జీటీ అనుమతులు వంటి తదితర రికార్డులను పరిశీలించాలని సీబీఐని కోరినట్లు తెలిపారు.
Also Read..
అందమైన బ్రోచర్లతో ‘ఐ’ మార్క్ మాయజాలం.. ఆ మంత్రి ఫుల్ సపోర్ట్ అంటూ జోరుగా ప్రచారం!