Vinod Kumar: ఆ డబ్బులను ప్రభుత్వం ఫ్రీజ్ చేసింది

by Gantepaka Srikanth |
Vinod Kumar: ఆ డబ్బులను ప్రభుత్వం ఫ్రీజ్ చేసింది
X

దిశ, వెబ్‌డెస్క్: హుజూరాబాద్ నియోజకవర్గం(Huzurabad Constituency)లో రెండో విడత దళితబంధు కోసం దళితులు చేస్తున్న ధర్నాకు మద్దతు తెలిపిన పాడి కౌశిక్ రెడ్డి(Padi Kaushik Reddy)పై దాడి చేయడాన్ని ఖండిస్తున్నట్లు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్(Vinod Kumar) ప్రకటించారు. శనివారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని పోలీస్ యంత్రాంగం మొత్తం సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కనుసన్నల్లోనే పని చేస్తోందని అన్నారు. పోలీసులు అనవసరంగా దాడి చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. దళితులపై లాఠీ ఛార్జ్ చేయడాన్ని బీఆర్ఎస్(BRS) పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు. దళితులకు రావాల్సిన డబ్బులను ప్రభుత్వం ఫ్రీజ్ చేసిందని ఆరోపించారు. దళితబంధు పథకానికి హుజూరాబాద్ నియోజకవర్గాన్ని కేసీఆర్(KCR) పైలెట్ ప్రాజెక్టుగా ఎంచుకున్నారు. దళితబంధు లబ్ధిదారులు ఆహ్వానిస్తేనే పాడి కౌశిక్ రెడ్డి ధర్నాలో పాల్గొన్నారు. లాఠీ ఛార్జ్‌లతో పోరాటాన్ని ఆపలేరని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Next Story

Most Viewed